ప్రకృతికి మనిషికి మధ్య జరిగిన సుదీర్ఘమైన యుద్ధం ముగిసింది ఆరోజు. మనిషే గెలిచాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాదించగలడని నిరూపించాడు. చెట్లు కొట్టేసి బిల్డింగులు కడితే కార్బన్ డై-ఆక్సైడ్ (CO2) ఎక్కువ అవుతుందనీ, దాని వలన ఉష్నోగ్రతలు పెరిగిపోతున్నాయి అని గ్రహించి ఒక శాస్త్రవేత్త చక్కటి పరిశోధన చెశాడు. బిల్డింగులనే చెట్లలా మార్చేశాడు! సిమెంటు photosynthesis చేసి CO2 పీల్చుకునెలా, జీవాయువు అయిన ఆక్సిజన్ (O2) ను విడుదల చెశేలా చెశాడు.
ఈ శాస్త్రవేత్తకు నొబెల్ బహుమాణం ఇస్తూ, “వాతావరణ మార్పిడి (Climate Change), భూతాపం (Global Warming) వంటి భయాలు ఇక అవసరం లేదు. మానవుడి అభివృద్దికి ఇక అడ్డు లేదు!” అని దేశ ప్రధానులు మూకుమ్మడిగా ప్రకటించారు.
రియల్ ఎస్టేట్ బిల్డర్లలో, పారిశ్రామిక వేత్తలలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. ఇక sustainability, ESG వంటి ముసుగులు అవసరం లేదు. వాళ్ళ ప్రాజెక్టులు ఎంత CO2 విడుదల చేస్తాయో లెక్కపెట్టే అవసరం లేదు. పర్యావరణం కోసం అంధోళన చేశే సన్నాసులను (activists) తన్ని పంపచ్చు. జిడిపి 20 శాతం పెంచవచ్చు అని లెక్కలు వేశారు.
ఇక చెట్లను నరకడం మొదలు పెట్టారు. మొదట హైదరాబాదు ప్రజల కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టారు. KBR పార్కును కొట్టేసి జూబిలీ హిల్సును- బంజారా హిల్సును కలుపుతూ రొడ్డేశారు. భూమి ధరలు బాగా పెరిగాయి. HCU లో చెట్లను కొట్టేసి పెద్దపెద్ద IT బిల్డింగులు కట్టారు. అక్కడ నివసించే నెమలులు, జింకలు రోడ్ల మీద తిరుగుతుంటే చూడ చక్కగా ఉండేది.
ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి ఆ చెట్లు కొట్టడంలో, బిల్డింగులు కట్టడంలో. ఈ ఉద్యోగస్తులకు ఇళ్ళ కోసం నగరం విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్ళి చేవెళ్ల వరకు వెళిపోయింది. అక్కడి మర్రి చెట్లను నరికేశారు. ఇలా రకరకాల చెట్లను బాగా నరకడానికి విశ్వవిద్యాలయాలలో డిగ్రీలు, డిప్లోమాలు కూడా చెయ్యడం మొదలు పెట్టారు: బి.టెక్ మర్రి చెట్టు నరకడం, ఎమ్.టెక్ అడవులను తొవ్వడం etc. ఎంత బా నరికితే అంత కట్నం కూడాను.
అభివృద్ది సరిపోవడం లేదు. విదేశీ పెట్టుబడులు తెచ్చారు. నల్లమల్లలో ఉరేనియమ్ కోసం లక్షల డాలర్లు పెట్టుబడి వచ్చింది. అడ్డు వచ్చిన పులులను జూలలో పాడేశారు. చెంచులను తుంచారు. శ్రీశైలం అప్పన్నను ఎంచక్కా రెండు గంటలలో దర్శించుకోవచ్చని జనం హర్శించారు. “మరి మా దేవుని దర్శనమో!” అని వెంకటేశ్వర స్వామి భక్తులు మొరపెడితే, ఏడు కొండలను చీల్చుకుంటూ బ్రిడ్జి కట్టారు. దేవుడికి దగ్గరలో ఉండచ్చని ఏడు కొండలలో ఏడు టవర్సు gated community కూడా కట్టారు. దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత ధర. ఇదంతా చూసి కుబేరుని అప్పు తీర్చేయచ్చని ఏడు కొండలస్వామి ఆశ పడ్దాడు.
అలా కొట్టగా కొట్టగా, చివరికి ఏడొవ కొండ మీద ఒక చెట్టు మిగిలింది. దానిని కూడా కొట్టేద్దాం అనుకున్నారు కానీ టూరిజంకి పనికొస్తదని ఒక యువ entrepreneurకి తోచింది. ఆ చివరి చెట్టు చుట్టూ కంచె వేసీ, సందర్శకులకు చూపెడితెే బోలెడు డబ్బు అని ప్రభుత్వాలను, పెట్టుబడిదారులను ఒప్పించాడు.
చివరి చెట్టును చూడడానికి తండోపతండాలుగా జనం. “గోవిందా గోవిందా” అనుకుంటూ ప్రదక్షిణలు చేశారు. దానిని తమ పిల్లలకు చూపెడదామని ప్రపంచంలోని తల్లితండ్రులందరూ సెలవులలో తిరుమలకు రావడం మొదలు పెట్టారు. ఇదంతా చూసి టికెట్టు ధర 5000 పెట్టాడు ఆ entrepreneur. VIP దర్శనం అయితే 50,000. చెట్టును ముట్టుకోవాలంటే లక్ష!
“నా అప్పు తీరిద్ది అనుకుంటే రాష్ట్రపు అప్పు తీరెలా ఉందే” అని ఏడు కొండలస్వామి బుంగ మూతి పెట్టాడు :(
Wrote this for a Hyderabad Write Club prompt at Smrithi event. The prompt was about writing the genre/theme that we feel is missing in Telugu literature/cinema. I wanted to write something dystopian.



Loveddd itt!