నమస్కారం!
గత వారం ఉత్తరం రాయలేక పోయాను. పుదుచ్చేరి వెళ్లడం వలన సమయం సరిపోలేదు. పైగా తెలుగు లో రాయల్ అంటే వేరే keyboard వాడాలి, ఇక్కడ substack లో రాయలేము.
అయితే ఈ వారం కొన్ని మంచి వార్తలు వచ్చాయి. UrbanEmissions, Dr .శరత్ గుత్తికుండ గారి దగ్గర నేను చేసిన పని ఒక జర్నల్ లో ప్రచురించబడింది. 1990 నుంచి 2022 వరకు ఢిల్లీ లో ఉన్న వాయు కాలుష్యం మీద అధ్యయనం ఇది. నేను ఒక సంవత్సరం పాటు ఢిల్లీ లో ఉండి ఈ సమస్య ను ప్రతక్షం గా అనుభవించాను, ఈ సమస్య మీద ఢిల్లీ సర్కారు తొ పని కూడా చేశాను. ఆ అనుభవాలను అప్పట్లో ఇక్కడ రాసాను - Automating impact. అయితే ఇప్పుడు ప్రచురించబడిన మా అధ్యయనం, ఢిల్లీ లో నేను చేసిన పనికి మరింత అర్థం చేకూర్చింది అని భావిస్తున్నాను.
నాకు ఈ అవకాశం కూడా యాదృచ్చికం గా వచ్చింది. ఒకసారి నేను ఒక కంపెనీ లో ఉద్యోగం కోసం ఢిల్లీ వాయు కాలుష్యం మీద 20 పేజీల రిపోర్టు రాసి పంపాను. అయితే ఈ కంపెనీ వాలు కారణం చెప్పకూండా నా అభ్యర్ధన ను తిరస్కరించారు. ఒక అభ్యర్థి ని పరీక్షించడానికి అంత పెద్ద పని ఇచ్చినప్పుడు కనీసం ఎందుకు తిరస్కరించారో చెప్పడం బావుండేది. అయితే ఈ రిపోర్టు లోని చిన్న భాగం datameet లో ఒక అగ్న్యాత PhD విద్యార్థి కి ఎదో అవసరం ఉంటె పంపించాను. Datameet అనేది ఒక ఇంటర్నెట్ సంఘం - సుమారు 3000 మంది ఉన్నారు ఇందులో. దేశం లో data ను పారదర్శకం చేయడానికి, అందరికి అందుబాటు లోకి తేవడానికి ఈ సంఘం లోని సభ్యులు స్వచ్చందంగా కృషిచేస్తారు. మా ఈ సంభాషణ ను, ఇదే సంఘం లో ఉన్న Dr శరత్ గారు కూడా చూసారు. చూసి, ఆయన చేసేయ్ ఢిల్లీ వాయు కాలుష్యం అధ్యనం లో నాకు అవకాశం ఇచ్చారు. కొన్ని నేలెల తర్వాత ఆ అవకాశహమే ఈ ప్రచురణ కు దారి తీసింది.
ఇంటర్నెట్ లో మంచి సంఘాల లో ఉంటె లాంటి చక్కని అనుభవాలు ఎన్నో జరుగుతాయి అని నమ్మకం కలిగింది. datameet అలాంటి ఒక సంఘం. మీరు కూడా data మీద పని చేస్తే ఈ సంఘం గురించి తప్పక తెలుసుకోండి. అలానే, మన పనిని, జ్ఞ్యానాని పంచుతూ ఉంటె అవకాశాలు యాదృచ్చికం గా వాస్తు ఉంటాయి. దాచి పెట్టి ఉండడం వలన స్వల్ప కాలం లో లాభం వఛిద్దేమో కానీ, పంచడం వలన దీర్ఘకాలం లో ఎక్కువ లాభం కలిగిద్ది అనే నమ్మకాన్ని కూడా ఈ అనుభవం బలపరిచింది.
ఈ వారం నాకు కాఫీ పిచ్చి పట్టింది. Dr అబ్బి ఫిలిప్స్ అని ఒక లివర్ డాక్టరు కాఫీ తాగడం వలన జరిగే లాభాల గురించి రాసారు. టీ, గ్రీన్ టీ బదులు బ్లాక్ కాఫీ తాగడం మంచిది అని ఎంతో శాస్త్రీయ అధ్యయం చేసి రాసారు. అది చదివినప్పటి నుంచి కాఫీ పిచ్చి పట్టింది. మంచి కాఫీ పొడుల గురించి మీకు తెలిస్తే చెప్పండి.
ఇక చివరి గా, రాజ్యాంగ బోట్ కోసం ఒక బ్లాగ్ రాయడం మొదలు పెట్టాను. ఈ వారం రెండు విషయాల మీద రాసాను -- శాస్త్రీయ దృక్పధం మరియు సుప్రీమ్ కోర్ట్ ఎలక్షన్ కమీషనర్ ల నియామకం మీద తీస్కునున్న నిర్ణయం. చదివి మీకు అనిపించింది నాతో చెప్పండి :)
ఇట్లు
సాయి కృష్ణ