నమస్కారం!
ఈ వారం కాస్త మెల్లిగా అయినట్టు ఉంది. మీకు ఉత్తరం రాసి చాలా కాలం అయినట్టు అనిపించింది.
ఈ వారం చెప్పుకోదగ్గ విషయం అంటే - బాగా రాసాను, చాలా కాలం తర్వాత. రాయడం నాకు మంచి సంతృప్తి కలుగచేస్తది. రాసింది వేరేయ్ వాళ్ళు చదివితే మరింత తృప్తి.
మొదట ఒక కథ రాసాను! Writeclubhyd అని ఒక సంఘం ఉంది హైదరాబాద్ లో. ప్రతి రెండు వారాలకు కలిసి ఎదో ఒక విషయం మీద కథలు రాస్తారు. అయితే ఈ వారం కాఫ్కా కథలు రాయడానికి కలిశారు. గత వారం, కాఫ్కా రాసిన Metamorphosis చదివి ఇది ప్రయత్నిద్దాం అనుకున్నాను. కాఫ్కా కథలలో ప్రధాన అంశం ఏంటంటే కథానాయకుడి ప్రపంచం ఒక్కదాటి గా తలకిందులు అయిపోయి, తనకి సమాధానం చెప్పకుండా మౌనం గా అయిపోతది. అలంటి అర్ధం లేని ప్రపంచం లో కథానాయకుడు ఎలా బ్రతుకుతాడో అదే కాఫ్కా కథ. అలాంటి ఒక కథ ప్రయత్నించాను. మీరు చదివి ఎలా ఉందొ చెప్తే ఆనందిస్తాను :)
నా రెండొవ రాత నా ఉద్యోగం లో భాగం గా ఒక Newsletter రాసాను. ప్రస్తుతం నేను Data for Justice అనే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను. చట్ట - న్యాయ వ్యవస్థ లో Data తయారు చేసి, ఆ data ద్వారా చట్టాలను అధ్యయనం చేసి సంస్కరణలు తీసుకురావడనికి మేము పని చేస్తున్నాము. ఈ భాగం గా చట్ట - న్యాయ వ్యవస్థ లో జరిగే ఆవిష్కరణల గురించి ఈ newsletter లో రాస్తాను. మీరు లాయర్, జడ్జి, చట్ట పరిశోధకులు అయితే తప్పక చదవండి.
ఈ వారం ఇక ఈ ఉత్తరం రాయడం తో ముగిస్తున్నాను. ఎప్పటికంటే ఎక్కువ రాసే అవకాశం వచ్చినందుకు ఆనందం :) వచ్చే వరం మరికొన్ని కథలతో మల్లి వస్తాను!
ఇట్లు
సాయి కృష్ణ




