నమస్కారం!
నేను ఈ మధ్య శుక్రవారాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాను. వీకెండ్ అని కాదు, శుక్రవారం రోజే నేను ఆ వారం లో జరిగింది అంతా మల్లి గుర్తు చేసుకుని ఉత్తరం రాస్తున్నాను. బా అనిపిస్తుంది. పైగా శుక్రవారం రాత్రి మాత్రమే నేను అలారమ్ పెట్టుకోకుండా పడుకుంటాను. అదొక సుఖం :)
సోమవారం మిన్హహాయిస్తే ఈ వారం కూడా చక్కగా గడిపాను. సోమవారం రోజు స్వీయ స్పృహ (self-consciousness) కాస్త ఎక్కువయింది లే. కానీ ఈమధ్య దాన్ని త్వరగానే అధిగమిస్తున్నాను. థియేటర్ శిక్షణ వలనో ఏమో.
ఈ వారం జరిగిన కొన్ని సంభాషణలు నాకు మంచి సంతృప్తిని ఇచ్చాయి. ఖని అని నాకు పరిచయం ఉన్న ఒకమ్మాయి కూడా ప్రతి వారం ఉత్తరాలు రాయడం మొదలు పెట్టింది. దానికి నా ఉత్తరాల నుంచి ప్రేరణ పొందింది అట. అలానే ట్విట్టర్ లో వినయ్ కుమార్ అని ఒకతను ట్వీట్ చేసాడు. అతను reclaimconstitution.in అని ఒక కార్యక్రమం మొదలు పెట్టాడు. రాజ్యాంగ విలువలను, జ్ఞ్యానాని పోస్ట్ కార్డ్స్ రూపం లో అతను తయారు చేసి అమ్ముతున్నాడు. దీనికి మా ట్విట్టర్ బాట్ నుంచి కాస్త ప్రేరణ పొందాడు అని చెప్పాడు. బా అనిపించింది. సహజంగా మనం ఎవరి నుంచి అయినా ప్రేరణ పొందితే, వాళ్ళకి ఆ విషయం చెప్పడానికి చాలా సంకోచిస్తాము. వాళ్ళు ఏమనుకుంటారో, నేను అతి చేస్తున్నానా, ఇలా మనకి మనమే ఏదేదో చెప్పుకుని విషయం చెప్పడం ఆపేస్తాం. అయితే నాకో అలవాటు ఉంది - నన్ను నవ్వించిన, ఆలోచింపచేసిన, ప్రేరేపించిన కళాకారులకు, రచయితలకు, పెద్దలకు నేను కనీసం ఒక మెయిల్, మెసేజ్ పెడతాను. అరుదు గా చూస్తారు అనుకోండి. కానీ చూసినప్పుడు నేను ఎలా అయితే నాకొచ్చిన ఈ రెండు మెసేజెస్ చూసి సంతృప్తి చెందానో, వాళ్ళు కూడా ఆలా సంతృప్తి చెందుతారు అనిపించింది. నేను చదివే పుస్తకం లో ఒక మంచి మాట ఉంది - "మనం ప్రేమ ని పంచితే అది వివిధ రకాల్లో రెట్టింపు అయి తిరిగి వస్తది అని". అలాంటి అనుభవం పొందాను అనిపించింది.
ఎన్నో నెలల తరువాత నేను నా సైకిల్ ని బయటకి తీసి ముస్తాబు చేశాను. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినప్పిటికి నా వాహన పరిజ్ఞ్యానం సైకిల్స్ తొ ఆగిపోయింది. మంచిదే గా అని నేను కూడా మిగతా వాహనాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ సైకిల్ వాళ్ళ ఇంధనం బదులు కొవ్వు కరిగిద్ది. పరిసరాలను కూడా బాగా గమనించే అవకాశం దొరికిద్దీ. మిగతా సైకిల్ నడిపేవాళ్లతో ఒక మంచి పరిచయం, స్నేహం ఏర్పడిద్ది. ఖర్చు ఉండదు. మన ట్రాఫిక్ లో అసల బైక్ మీద ఎళ్లినా సైకిల్ మీద ఎళ్లినా పెద్ద తేడా ఏమి ఉండదు. అన్ని లాభాలే.
నాకు సైకిల్ మీద ఎంత ప్రేమ అంటే ఒకప్పుడు దీని మీద ఒక చిన్న కథ కూడా రాసాను. కుదిరితే చదవండి :)
అంతే ఈ వారపు కబుర్లు. మీరు చెప్పే కబుర్లు కోసం ఎదురు చూస్తుంటాను.
ఇట్లు
సాయి కృష్ణ



